పవన్ సాబ్, నీ ఫాలోయింగ్ కి సోషల్ మీడియా బద్దలైంది…!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరాం దర్శకత్వంలో వస్తున్న చిత్రం వకీల్ సాబ్. సోమవారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టైటిల్ ఏమో గాని పవన్ కళ్యాణ్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో విడుదల చేసిన కాసేపటికే ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా రెండేళ్ళ తర్వాత పవన్ సినిమా రావడంతో ఇప్పుడు ఈ లుక్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది.

అటు టాలీవుడ్ చిన్న హీరోలు కూడా పవన్ ఫాలోయింగ్ చూసి ఫిదా అయిపోతున్నారు. చిన్న చిన్న నటులు అందరూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పవన్ సర్ మీరు సూపర్ అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం. పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నారు. దీనితో ఆయన లాయర్ గా ఏ విధంగా నటిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది.

ఇప్పటి వరకు పవన్ ఆ పాత్రలు చేయలేదు. దీనితో అందరు దీని మీదే చర్చిస్తున్నారు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. పవన్ లుక్ కొందరు నార్మల్ గా ఉందీ అంటే మరికొందరు మాత్రం చాలా బాగుంది అంటున్నారు. పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news