ప్రభాస్ కి సాహో లాంటి సినిమాల మీద చిరాకేసిందట …ఎందుకో తెలుసా ..?

ప్రభాస్ బాహుబలి ఫ్రాంచైజీ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రేంజ్ హీరో ఇంకెవరు లేరన్న పేరుని సంపాదించుకున్నాడు. అంతేకాదు బాహుబలి సినిమాని హాలీవుడ్ మేకర్స్ కూడా ప్రశంసించడం ఎంతో గొప్ప విషయం. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి తెలుగు చిత్ర పరిశ్రమని ఎంతో ఎత్తులో నిలబెట్టారు. సినిమాకి ఎంత క్రేజ్ దక్కిందో ప్రభాస్ కి అంత క్రేజ్ దక్కించి.

 

దాంతో సాహో వంటి మరో భారీ చిత్రాన్ని తెలుగు హిందీలో నిర్మించారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సాహో ఫస్ట్ టీజర్ రిలీజైనప్పటి నుంచే భారీ అంచనాలను పెంచేసింది. బాహుబలి కన్‌క్లూజన్ లో సాహో సినిమా నుండి రిలీజ్ చేసిన టీజర్ దాదాపు రెండేళ్ళ ముందుగా రిలీజ్ చేశారు. అది అద్భుతంగా ఉండటంతో సాహో బాహుబలి సినిమాని మించిపోతుందని ప్రభాస్ తో పాటు అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచానాలను, ఊహలను తారుమారు చేసింది సాహో సినిమా. ప్రేక్షకులనే కాదు ప్రభాస్ ని దారుణంగా డిసప్పాయింట్ చేసింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ద కపూర్, గెస్ట్ అపీరియన్స్ గా మరో బాలీవుడ్ బ్యూటి జాక్విలిన్ ఫెర్నాండస్ ఉన్నప్పటికి సినిమా కి అసలు ఏమాత్రం ఉపయోగాడలేదు. అంతేకాదు ప్రేక్షకులు ప్రభాస్ ని ఎందుకనో ఆ క్యారెక్టర్ లో చూడలేకపోయారు. ఇక ప్రభాస్ తాజాగా చేస్తున్న జాన్ సినిమా కూడా క్లాస్ లవ్ స్టోరీనే అని అంటున్నారు. అయితే ప్రభాస్ ఇప్పుడు సాహో లాంటి సినిమాలని ఇష్టపడటం లేదట. దాంతో మరో సారి మాంచి మాస్ సబ్జెక్ట్ తో రావాలని ప్లాన్స్ వేసుకుంటున్నాడట. అందుకే మిర్చి వంటి సినిమా కథ తో ఎవరైనా వస్తే రెడీ అవ్వాలని ఆలోచనలో ఉన్నాడట. మొత్తానికి ప్రభాస్ ఇన్నాళ్ళకి కళ్ళు తెరిచాడు.