పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందా..?

తెలుగు చలన పరిశ్రమలో డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న పూరీ జగన్నాథ్, ఇస్మార్ట్ శంకర్ తో విజయపథంలోకి వచ్చాడు. అంతకుముందు వరుస ఫ్లాపులు రావడంతో ఇక పూరీ పని అయిపోయిందనే అనుకున్నారు. కానీ ఇస్మార్ట్ శంకర్ తో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. ఐతే చాలా రోజులుగా పూరీ, తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడు.

మహేష్ బాబు హీరోగా ఈ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేసాడు. కానీ ఇప్పటి వరకూ జనగణమన పట్టాలెక్కలేదు. తాజాగా ఈ సినిమా విషయమై మళ్ళీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కి సిధ్ధం అవుతున్న మహేష్ బాబు, ఆ తర్వాత పూరీ జగన్నాథ్ జనగణమన సినిమా చేయబోతున్నాడని అంటున్నారు. రాజమౌళితో సినిమా చేయబోయే ముందు జనగణమన కంప్లీట్ చేస్తాడని గాసిప్స్ వినబడుతున్నాయి. మరి ఇదే నిజమైతే పూరీ జగన్నాథ్ డ్రీమ్ నెరవేరినట్టే..!