స్టార్ డైరెక్ట‌ర్ వైన్ పురాణం!

-

లాక్‌డౌన్ పుణ్య‌మాని అంతా కొత్త ప‌ద్ద‌తుల‌కు క‌న్వ‌ర్ట్ అవుతున్నారు. కొంత మంది కాల‌క్షేపం కోసం మారుతుంటే..  స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ మాత్రం త‌న‌కు తెలిసిన విష‌యాల్ని ప‌దిమందితో పంచుకోవ‌డానికి కొత్త పంథాని ఎంచుకున్నారు. యాపిల్ పోడ్ కాస్ట్‌.. కొత్త యాప్ స్పోటీఫై యాప్ ద్వారా కొత్త విష‌యాల‌కు సంబంధించిన త‌ను చెప్పిన‌ ఆడియో వాయిస్‌ల‌ని రిలీజ్ చేస్తున్నారు.

తాజాగా పూరి చెప్పిన వైన్ పురాణం వైర‌ల్‌గా మారింది. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఆయ‌న ఈ విష‌యంలోనూ త‌న వెర్స‌టాలిటీని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. పూరి తాజాగా వైన్‌పై ఓ పురాణ‌మే విప్పారు. వైన్ తాగడం ఓ క‌ళ అంటూ వైన్ పుట్టు పూర్వోత్తరాలు చెప్పారు. కొన్ని దేశాల్లో ఫుడ్ తిన్నాక వైన్ తాగి హాయిగా చ‌చ్చిపోవ‌చ్చ‌ని షాకిచ్చాడు. వైన్ 7000 ఏళ్ల క్రితం చైనాలో దీన్ని మొట్ట‌మొద‌టిసారిగా త‌యారు చేశార‌ని, ఆ త‌రువాత జార్జియా, ఇరాన్‌, సిసిలీలో మెల్ల‌గా మొద‌లైంద‌న్నారు. ప్రాంతాన్ని మ‌న‌కు అందుబాటులో వుండే గ్రేప్‌ని బ‌ట్టి వైన్ టేస్ట్ మారుతూ వుంటుద‌ట‌. వెద‌ర్‌, స‌న్‌లైట్‌, వాట‌ని కూడా దీని టేస్ట్‌ని డిసైడ్ చేస్తుందంటున్నారు.

ఇక ఏ ఏ కంట్రీల్లో దీన్ని ఏమ‌ని పిలుస్తారు? ఎన్ని పేర్లున్నాయి. దీని టేస్ట్ ఎలా వుంటుందో కూడా వివ‌రించారు పూరి. క్యాబ‌నిస్ సోరియాన్‌, మెర్లో, టెంప‌రానిలోచ గామె, చిరా, పిను నోయ‌ర్‌.. ఇలా ఎన్నో పేర్లున్నాయ‌ట‌. చాలా మందికి రెడ్ వైన్, వైట్ వైన్ , రోజ్ వైన్ మాత్ర‌మే తెలుసు కానీ మ‌రోవైన్ కూడా వుంద‌ట‌. వైట్‌వైన్‌కి గ్యాస్ ఫిల్ చేస్తే దాన్ని స్పార్కింగ్ వైన్ అంటార‌ట‌. .. పూరి వైన్ పురాణం విన్న వాళ్లంతా వైన్ కి ఇంత పురాణం వుందా అని అవాక్క‌వుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news