అవకాశాలు రాకపోవడానికి ఆ హీరోయినే కారణం అంటున్న రాధిక ఆప్టే..!!

-

బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రాధిక ఆప్టే గురించి ఆమె గ్లామర్ విందు గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియా ద్వారా కూడా తనదైన శైలిలో గ్లామర్ ఫోటోస్ తో మరింత రచ్చ చేస్తోంది. ఇకపోతే రాధిక ఆప్టే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎటువంటి పాత్ర చేయడానికి అయినా వెనుకాడదు. సినిమాలలో విభిన్నమైన పాత్రలను ఎంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. అంతేకాదు కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రాముఖ్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే తన బోల్డ్ నెస్ వల్ల కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నట్లు తెలిపిన విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు… ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధిక ఆప్టే పలు విషయాల గురించి చర్చిస్తూ ఇలా మాట్లాడారు. యంగ్ హీరోయిన్స్ కారణంగా అవకాశాలు కోల్పోతున్నట్లుగా తెలిపిన రాధిక ఆప్టే.. లుక్స్ కారణంగా ఎప్పుడైనా సినిమాలలో పాత్రలను కోల్పోయారా అని యాంకర్ ప్రశ్నించగా ఈ విషయంపై స్పందించిన ఆమె హీరోయిన్స్ కి ఆఫర్స్ రావడంలో వయసు అనేది కూడా ఒక ప్రధాన అంశము.. అందుకే కమర్షియల్ సినిమాలలో యంగ్ హీరోయిన్ లకు ఎక్కువ అవకాశాలు ఇస్తారు. అంతేకాకుండా టాలెంట్ ని కాకుండా లుక్ ని బట్టి కూడా అవకాశాలు ఇవ్వడం అనేది మన ఇండియాలో మాత్రమే కాదు విదేశాలలో కూడా ఉంది అంటూ తెలిపింది.

తాను మాత్రం అందం అనే మాయలో ఎప్పుడు పడలేదని, యవ్వనంగా కనిపించడానికి ఎప్పుడు సర్జరీలు కూడా చేయించుకోలేదని అలాగే అవకాశాల కోసం ఏ అడ్డదారులు తొక్క లేదని వెల్లడించింది. అయితే కెరియర్ లో సక్సెస్ కోసం ఇబ్బందులు పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని కొత్త హీరోయిన్స్ వల్ల తనకు అవకాశాలు రావడం లేదు అని కూడా తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news