ప్రముఖ కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ తండ్రి అయ్యాడు. సంక్రాంతి రోజున తన భార్య హరిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు సోషల్ మీడియాలో అతను వెల్లడించాడు. ‘బాయ్, సంక్రాంతి రిలీజ్’ అంటూ పోస్ట్ చేశాడు.
దీంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెబుతున్నారు. గతంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పిన రాహుల్ తర్వాత పెళ్లి ముచ్చట్లు ఏవి వెల్లడించలేదు. కానీ గతేడాది నవంబర్ లో తన భార్య ప్రెగ్నెంట్ అనే విషయాన్నితెలిపాడు.