ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హైదరాబాదులోని ఒక గల్లీలో పుట్టి బార్బర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి ఆస్కార్ స్టేజిపై పర్ఫామెన్స్ చేసే రేంజ్ కి ఎదిగాడు రాహుల్ సిప్లిగంజ్. ఒకవైపు సింగర్ గా మరొకవైపు ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో రాజకీయాలకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారుతుంది. త్వరలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
త్వరలోనే తెలంగాణలో ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ నేపథ్యంలో రాహుల్ సిప్లిగంజ్ ఉండే ఏరియా గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు గోషామహల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం లేదు అంటూ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ కూడా పెట్టాడు.
తన పోస్టులో నేను పాలిటిక్స్లోకి రావడం లేదు. నా మీద ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ఆ వార్తలన్నీ అబద్దమే.. అన్ని పార్టీలకి చెందిన మన లీడర్స్ అందరినీ నేను గౌరవిస్తాను.. నేను ఒక మ్యూజిషియన్, ఆర్టిస్ట్ మాత్రమే.. నా జీవితం అంతా కూడా ఇదే..నా ఫీల్డ్ లో నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది ప్రస్తుతం కెరియర్ పైన ఫోకస్ చేశాను. ఏ పార్టీ నుంచి కూడా నాకు ఎలాంటి ఆఫర్లు రాలేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఇటీవల రాహుల్ సిప్లిగంజ్ సోదరుడి వివాహానికి అన్ని పార్టీలకు చెందిన టాప్ లీడర్లు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.