క‌లిసి డ్యాన్స్ చేయ‌నున్న ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్.. హైప్ కోసం రాజమౌళి ప్లాన్‌

ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో మాట్లాడుకుంటున్న పెద్ద సినిమా ఆర్ ఆర్ ఆర్‌. ఈ సినిమాపై ఇప్ప‌టికే ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. ఇక దీంట్లో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ క‌లిసి చేస్తుండ‌టంతో హైప్ వేరే లెవెల్‌లో ఉంది. ఇక రాజమౌళి (Rajamouli) కూడా వీరిద్ద‌రి విష‌యంలో బ్యాల‌న్స్‌గా ఆలోచిస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇద్ద‌రికీ ఎక్క‌డా త‌గ్గ‌కుండా సీన్స్ క్రియేట్ చేస్తున్నాడు.

ఇప్ప‌టికే ఇద్ద‌రి టీజ‌ర్ల‌తో గూస్ బంప్స్ హైప్ క్రియేట్ చేసిన జ‌క్క‌న్న ఇప్పుడు మ‌రో లెవెల్ హైప్ కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇద్ద‌రు హీరోలు డ్యాన్సుల్లో ఎవ‌రికి ఎవ‌రూ తీసిపోరు. వీరు స్టెప్పులేస్తే ఫ్లోర్‌ దద్దరిల్లిపోవాల్సిందే.

దీంతో ఈ అవకాశాన్ని వాడుకోవాల‌ని చూస్తున్నాడు జ‌క్క‌న్న‌. ఇద్దరు హీరోల మీద కంబైన్డ్‌గా ఓ సాంగ్ డిజైన్ చేస్తున్నారన్నది ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్‌. ఈ పాటను ఏ ఫ్లేవర్‌లో తీస్తారన్నది ప‌క్క‌న పెడితే ఇందు కోసం స్పెషల్‌గా నెలరోజుల షెడ్యూల్‌ ప్లాన్ చేశాడంట ద‌ర్శ‌క‌దిగ్గ‌జం. లాక్‌డౌన్ అయిపోయి క‌రోనా తీవ్ర‌త కాస్త త‌గ్గ‌గానే ఈ సాంగ్‌ మేకింగ్‌తోపై షూటింగ్ చేస్తారంట ఆర్ ఆర్ ఆర్ టీమ్‌. నిజంగా ఇది వీరి ఫ్యాన్స్‌కి పండ‌గే అని చెప్పాలి.