వీటిని కనుక మీ డైట్ లో తీసుకుంటే జ్ఞాపకశక్తి (memory) సులువుగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి పండ్లు, కూరగాయలు బాగా ఉపయోగపడతాయి. అదే విధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా సహాయపడతాయి. ఆకు కూరలు కూడా బ్రెయిన్ హెల్త్ కి మంచిది. నట్స్, గింజలు వంటివి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
జ్ఞాపకశక్తి పెంచుకోవడానికి తీసుకోవాల్సిన ఆహారం:
జీడిపప్పు:
జీడిపప్పు జ్ఞాపక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో పాలీ సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి బ్రెయిన్ కి చాలా అవసరం.
బాదం:
బాదం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది బ్రెయిన్ లో అసెటిల్ కొలిన్ లెవెల్స్ ని పెంచుతుంది దీనిలో విటమిన్ బి6, జింక్, ప్రొటీన్ కూడా ఉంటాయి. ఇవి బ్రెయిన్ హెల్త్ కి చాలా మంచిది.
గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్:
ఇవి రెండూ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా బ్రెయిన్ కి చాల మంచివి. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో జింక్, మెగ్నీషియం, విటమిన్ డి ఉంటాయి. ఇవి జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి.
వాల్ నట్స్:
వాల్ నట్స్ బ్రెయిన్ కి సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. దీనిలో ఆల్ఫా లినోలిక్ యాసిడ్, పాలీ ఫినాల్స్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి కూడా ఒత్తిడిని, ఇన్ఫ్లమేషన్ ని దూరం చేసి జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.