సుడిగాలి సుధీర్ సినిమాలో పాట పాడిన రాజమౌళి..

-

జబర్దస్త్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్ … కమెడియన్ వేణు టీంలో నుండి టీంలీడర్ గా ఎదిగిన సుధీర్ తనదైన హాస్యంతో ప్రేక్షకులను మెప్పించాడు. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా ఢీ, పోవే పోరా’ వంటి టెలివిజన్ షోల ద్వారా కూడా ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌ హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమవుతున్నారు. ‘రాజుగారి గది’ ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శేఖర ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ పారిశ్రామికవేత్త కె.శేఖర్‌ రాజు నిర్మిస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గరలో ఉండడంతో ప్రమోషన్స్ మొదలు పెట్టింది చిత్ర యూనిట్..అందులో భాగంగానే ఓ ప్రమోషనల్ సాంగ్ కూడా విడుదల చేసారు. ఈ పాటను రాజమౌళి పాడాడు. రాజమౌళి అంటే మన దర్శకధీరుడు ఎస్‌.ఎస్. రాజమౌళి కాదులెండీ.. ఆయన అన్నయ్య కీరవాణి సినిమాల్లోనే పాడడు.. ఇంక సుధీర్ కోసం ఏం పాడతాడు..? జబర్దస్త్ కామెడీ షోలో తాగుబోతు పాత్రలతో బాగా ఫేమస్ అయిన రాజమౌళి ఉన్నాడు కదా.. ఆయనే ఇప్పుడు సుధీర్ సినిమా కోసం పాడాడు. అయితే ఈ పాటకి యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news