ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నాలుగేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా విజృంభించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి రెక్కులు వచ్చేశాయి. రాజధాని ప్రకటన రాకముందు ఇక్కడ ఎకరం రు.20 లక్షలు అంటేనే గొప్ప అన్నట్టుగా ఉండేది. ఎప్పుడైతే రాజధాని ప్రకటన వచ్చేసిందో అప్పటి నుంచి ఎకరం మారుమూల చోట్ల కూడా ఏకంగా రు.2 కోట్ల వరకు టచ్ అయ్యింది.
ఇక తుళ్లూరు, తాడికొండ లాంటి చోట్ల ఎకరం రు.5 కోట్లను క్రాస్ చేసింది. ఏపీతో పాటు తెలంగాణ, చెన్నై, బెంగళూరుకు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అమరావతిలో రాజధాని నిర్మాణంపై అనేక అనుమానాలు ముసురు కుంటున్నాయో ? అప్పటి నుంచి రాజధాని ప్రాంతంలో రియల్ భూం ఒక్కసారిగా పేలిపోయింది.
ఇక జగన్ కేబినెట్లో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం రోజుకో కాంట్రవర్సీ ప్రకటనతో రాజధాని అమరావతి అక్కడ ఉండదంటూ అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కూడా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పెద్ద మైనస్‌గా మారింది. ఇక ఇప్పుడు అమరావతిలో మరో సరికొత్త ఆందోళన కూడా తెరమీదకు రావడంతో రియల్ బుడగ పూర్తి పేలిపోయినట్టే కనిపిస్తోంది.
అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు రెండు వర్గాలుగా ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ నెల 28న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనను కొందరు సమర్థిస్తుంటే.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. గ్రాపిక్ జిమ్మిక్కులతో రాజధాని అంటూ ఐదేళ్లుగా ఊదరగొట్టిన చంద్రబాబు తమను నిలువునా ముంచేశారని కొందరు ఆరోపిస్తున్నారు.
ఇక రెండో వర్గం రైతులు మాత్రం చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తున్నారు. ఏపీ భవిష్యత్ పై విశ్వాసంతో తాము భూములు ఇచ్చామని, ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాజధానిని ఇక్కడ నుంచి మార్చేయాలని చూస్తుండడంతో తమ ఫ్యూచర్ ఏం ? కావాలా ? అని వారు ప్రశ్నిస్తున్నారు. వీరంతా బాబుకు సపోర్ట్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం రాజధాని విషయంలో గంరదగోళం క్రియేట్ చేయడంతో రేట్లు సైతం 30 నుంచి 50 శాతం పడిపోతున్నాయని రెండో వర్గం రైతులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు రైతులంతా యూనిటీగా ఉండేవారు. ఇప్పుడు రైతులు కూడా రెండుగా చీలిపోవడంతో ఇక్కడ రియల్ వ్యాపారం పూర్తిగా స్తంభించిపోయింది.