Rajamouli: ఆసిఫాబాద్‌లో రాజమౌళికి ఆదివాసీల ఘనస్వాగతం..గాలి బుడగల థియేటర్‌లో RRR చూసిన దర్శకులు

-

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకులు రాజమౌళి మంగళవారం కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌కు వెళ్లారు. ఆసిఫాబాద్ లోని జన్కాపురంలో పిక్చర్ ట్యూబ్ సంస్థ ఏర్పాటు చేసిన గాలిబుడగల థియేటర్ ను సందర్శించారు. ఈ క్రమంలోనే రాజమౌళిని చూసేందుకు ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.

రాజమాళి ఆయన భార్య రమా రాజమౌళితో ఆసిఫాబాద్ జిల్లాకు రాగా, ఆదివాసీలు ఘన స్వాగతం పలికారు. ఆదివాసీ గుస్సాడీ నృత్యాలతో సంప్రదాయంగా జక్కన్నకు స్వాగతం పలికారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి, అధికారులతో కలిసి మాస్టర స్టోరి టెల్లర్ కొమురం భీం ఫొటోలకు నివాళి అర్పించారు.

జిల్లా కేంద్రంలోని పిక్చర్ ట్యూబ్ సినిమా థియేటర్ ను సందర్శించిన రాజమౌళి..అందులోనే ప్రేక్షకులతో కలిసి RRR పిక్చర్ చూశారు. పిక్చర్ ట్యూబ్ సంస్థ వారు ఏర్పాటు చేసిన గాలిబుడగల థియేటర్ గురించి అడిగి తెలుసుకున్నారు జక్కన్న. ఎంత గాలి వీచినా చెక్కు చెదరకుండా ఉండేలా థియేటర్ ను రూపొందించినట్లు నిర్వాహకులు దర్శకుడు రాజమౌళికి చెప్పారు.

ఃఅతి తక్కువ వ్యయంతో నిర్మించిన గాలిబుడగల థియేటర్ గురించి ఇటీవల తెలుసుకున్న తానే స్వయంగా చూడటానికి వస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే అయన తన మాట నిలబెట్టుకున్నారు. మంగళవారం థియేటర్ ను సందర్శించి ప్రేక్షకులతో కలిసి సినిమా కూడా చూశారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీంగా తారక్ నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news