నా వైఫ్ కు నేనిచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే.. ఆస్కార్ రెడ్ కార్పెట్ పై రామ్ చరణ్ కామెంట్స్

-

95వ ఆస్కార్ పురస్కారాల వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. తారలంతా ఈ వేడుకకు చాలా అందంగా తయారై వచ్చారు. మెరిపించే ఔట్ ఫిట్ లో మెస్మరైజింగ్ చార్మ్ తో సందడి చేశారు. రెడ్ కార్పెట్ పై నడుస్తుంటే.. తారలు దిగివచ్చిన వేళ అని బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ ప్లే అయినట్టుగా అనిపించింది. ఈ వేడుకకు RRR టీమ్ కూడా హాజరైంది. భారతీయ సంప్రదాయ డ్రెస్సుల్లో ఓ వైపు సంప్రదాయంగా.. మరోవైపు ట్రెండీ గా కనిపించారు.

రెడ్ కార్పెట్ పై RRR టీమ్ సందడి చేయగా.. వారిని చూసి అక్కడున్న డ్యాన్సర్స్ అంతా నాటు నాటు పాటకు కాలు కదిపారు. రెడ్ కార్పెట్ పై రామ్ చరణ్.. తన భార్య ఉపాసనతో కలిసి నడిచారు.  తన భార్యకు ఇస్తున్న బెస్ట్ గిఫ్ట్ ఇదని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉపాసన ఆరు నెలల గర్భవతి అని చెప్పారు.

ఆస్కార్ వేడుకలో ‘నాటు నాటు’ సింగర్స్ గాయకులు కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news