టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడుగా పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ త్వరలోనే మరో సంచలనానికి తెర తీయనున్నట్టు తెలుస్తోంది. నిజం పేరుతో ఓ చానల్ ను ప్రారంభిస్తున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనం సృష్టిస్తూనే ఉంటారు సినిమాలతో బయట నిజజీవితంలో సైతం తనకు నచ్చినట్టు ఉండే రాంగోపాల్ వర్మ త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కు శ్రీకారం చుట్టం ఉన్నట్టు తెలుస్తోంది అంతేకాకుండా ఈ ఛానల్ తో ఎన్నో నిజాలు బయట పెడతాను అంటూ చెప్పడం మరో విశేషం.
తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న పోస్టులో ‘నిజం’ యూట్యూబ్ ఛానల్ ని ఉద్దేశిస్తూ వర్మ చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. మొదటి ఎపిసోడ్ గా వివేకా మర్డర్ కేసు ఎంచుకున్నారు. ఏపీలో సంచలనం రేపుతున్న వివేకా మర్డర్ ఎపిసోడ్ పై తన ఛానల్ లో విశ్లేషణ పెడుతున్నాడట. ఎక్స్పర్ట్స్ తో మర్డర్ ఎవరు చేశారు? అసలు నిందితులు ఎవరు? హత్యకు కారణాలు ఏమిటీ? మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? అంటూ పలు విషయాలు చర్చిస్తారు అన్నట్టు తెలుస్తోంది.
ఇంకా వర్మ తన వరుస పోస్ట్స్ లో ‘నేను ప్రారంభించబోయే”నిజం” అనే యూ ట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారేస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది…”
”అబద్ధం బ్రతికేదే నిజాన్ని చంపటం కోసం. నిజాన్ని ఎవ్వరూ చంపలేరు.కానీ నిజం అప్పుడప్పుడు చచ్చిపోయినట్టు నటిస్తుంది. కానీ దానికి మోసపోయి,అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరంతో డాన్స్ లాడుతూండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుంది…” అంటూ పోస్ట్ చేశారు వర్మ.
అలాగే ”నిజాన్ని చేధించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్ .అనాలిసిస్, టెక్నాలజీ, జరుగుతున్న విషయాలు అన్నింటికన్నా ముఖ్యంగా మోటివ్ మీద కాన్సంట్రేట్ చేయడం ద్వారా నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చు”
“నిజం”ఛానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైమ్, న్యాయ స్థానాలు ,ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి”.
”నిజం గురించి ప్రతి ఎపిసోడ్లో నేనే కాకుండా ఎక్స్పర్ట్స్ వేరే వేరే టాపిక్స్ అనలైజ్ చేస్తారు. కొన్నిసార్లు నేను వాళ్ళతో.. కొన్నిసార్లు స్వప్నగారు వాళ్ళతో.. కొన్నిసార్లు వేరేవాళ్ళు ఎవరెవరితోనో ఇంటర్వ్యూలు చేస్తారు. అలా నిజాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ నిజం ఛానల్ గొడుగు కింద కేటాయించిన ప్రత్యేక చోటుంటుంది”
”వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు,ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు,ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే “నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం”
”నిజం నివురు కప్పిన నిప్పు లాంటిది.. ఎప్పుడో అప్పుడు మంటగా మారి అబద్దాన్ని కాలుస్తుంది.. నిజం” ఛానల్ 1st ఎపిసోడ్ “వివేకా హత్య వెనక నిజం లో అబద్దముందా ?” అంటూ రాంగోపాల్ వర్మ ఇంస్టాప్ వేదికగా పంచుకున్న ఈ పోస్ట్ లని ప్రస్తుతం వైరల్గా మారాయి. కాగా ఏప్రిల్ 25 సాయంత్రం నాలుగు గంటలకు ఈ ఛానల్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.