గతంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగగా.. ఆ ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించి అమెరికా అధ్యక్షుడిగా పదవిని చేపట్టారు. కాగా భారతదేశ వారసత్వం ఉన్న మహిళ కమల హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఈహతే త్వరలోనే జో బైడెన్ కు అధ్యక్షుడిగా పదవీకాలం ముగియనుండగా, తర్వాత ఎన్నికల గురించి ఇప్పుడే చర్చలు జరుగుతున్నాయి. ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు ఎవరు కానున్నారు అన్ని చాలా దేశాలు ఎదురుచూస్తూ ఉంటాయి. అయితే తాజాగా జో బైడెన్ సోషల్ మీడియా ద్వారా అందించిన సమాచారం ప్రకారం వచ్చే అధ్యక్ష ఎన్నికల్లోనూ జో బైడెన్ పోటీ చేయనున్నాడు.
కాగా ఈ అధ్యక్ష ఎన్నికల పోటీలో మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరియు నిక్కీ హేలీ లు పోటీ పడనున్నారు. మరి జో బైడెన్ అధ్యక్షుడిగా ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అన్నది తెలియాలంటే మరోసారి అమెరికా ప్రజలు అతనిని గెలిపించి తీరాలి ? ఒకవేళ ఓడిపోతే పాలన సరిగా జరగలేదని అర్ధం చేసుకోవాలి.