టాలీవుడ్ సినిమాలకి రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఫారిన్ లొకేషన్స్ ..!

-

కరోనా విసిరిన పంజా దెబ్బకి ప్రపంచం మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలలో అందరికి అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతానికి లాక్ డౌన్ నేపథ్యంలో 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన పనులన్ని స్థంభించిపోయాయి. అయితే ఈ పరిస్థితులు ఇప్పట్లో చక్కబడేలా కనిపించడం లేదు. ముఖ్యంగా విదేశాలలో షూటింగ్స్ ఇప్పట్లో వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా లేనట్టే.

 

విజయ్ దేవరకొండ -పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమా నలభై శాతం ముంబై పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ జరిగింది. ముఖ్యంగా ధారి లో ఎక్కువ భాగం షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. అంతేకాదు బ్యాంకాక్ లోను టాకీ పార్ట్ అండ్ సాంగ్స్ ప్లాన్ చేశారు పూరి. అయితే ముంబై మొత్తాన్ని కరోనా మహమ్మారి వ్యాపించి ఉన్నందున అన్ని చోట్లా లాక్ డౌన్ ఎత్తేసిన ఇప్పుడప్పుడే షూటింగ్స్‌కు అనుమతినిచ్చే అవకాశం లేదని ష్పష్ఠం అవుతోది. అందుకే పూరి విజయ్ సినిమాని హైదరాబాద్ లోనే ఏదో ఒక సెట్ వేసి షూట్ చెయ్యాలనే నిర్ణయంతో ఉన్నారట.

ఇక ప్రభాస్ – రాధాకృష్ణ సినిమా ఎక్కువ శాతం విదేశాల్లోనే షూటింగ్ జరగాల్సి ఉంది. ఆస్ట్రియా, జార్జియా, యూరప్ అంటూ సినిమా కథలో రాసుకున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితి విదేశాలకు షూటింగ్స్ కోసం వెళ్లే పరిస్థితి లేదు. అందుకే రాధాకృష్ణ ప్రభాస్ సినిమా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. లాక్ డౌన్ తో ఖాళీగా ఉన్న రాధాకృష్ణ ఫారెన్ లో షూట్ చేయాల్సిన కొన్ని సన్నివేశాలను ఇండియాలోనే షూట్ చేసేలా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశారట. లాక్ డౌన్ అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందట. అంతేకాదు పుష్ప సినిమా కోసం కూడా సుకుమార్ కొంత భాగాన్ని విదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేసి డ్రాపయ్యారు. ఇప్పుడు ఫారిన్ లొకేషన్స్ లో షూటింగ్ చేయాలనుకుంటున్న సినిమాలకి రామోజీ ఫిల్మ్ సిటీనే ఛాయిస్ అవుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news