పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ.. ఆ సీన్ కోసం 37 టేకులట..!

-

ప్రముఖనటి రమ్యకృష్ణ పోర్న్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సూపర్ డీలక్స్ పై ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగాయి. ఆమె పాత్ర తెరపై ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది.

కోలీవుడ్ లో భారీ అంచనాలతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా సూపర్ డీలక్స్. ఈమధ్యనే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ ఈ నలుగురు పాత్రలతో సినిమా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో రమ్యకృష్ణ పోర్న్ స్టార్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ పాత్ర తన కెరియర్ లో ఛాలెంజింగ్ రోల్ అంటూ చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ.

రమ్యకృష్ణ కెరీర్లోనే ఛాలెంజింగ్ రోల్

సినిమాలో ఓ సన్నివేశం కోసం దాదాపు 37 టేకులు తీసుకున్నారట. సినిమాకు హైలెట్ గా నిలిచే ఆ సీన్ లో రమ్యకృష్ణ నటన అద్భుతమని అంటున్నారు చిత్రయూనిట్. పోర్న్ స్టార్ గా ముందు నదియాను అనుకోగా ఆ పాత్రకు రమ్యకృష్ణ తగిన వ్యక్తి అని ఆమెను సంప్రదించడం జరిగింది. సినిమాలో మల్లూ అన్ కట్ అనే సినిమాలో పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ కనిపిస్తారు. సినిమాకు ఆమె నటన హైలెట్ అవుతుందని అంటున్నారు.

ఇక వీరితో పాటుగా సమంత, విజయ్ సేతుపతి కూడా సినిమాకు బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నారని అన్నారు. త్యాగరాజన్ కుమార్ రాజా డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మిస్కన్ అందిస్తున్నారు. ఇన్ని సంచలనాలతో వస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. మార్చి 29న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news