ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మీ గౌతమ్ గురించి ,తన నటన గురించి, యాంకరింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో, నటనతో ఎంతోమంది అభిమానులను సైతం సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాదు పలు విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తనదైన శైలిలో సమాధానం ఇస్తూ ఉంటుంది. అయితే వివాదాలకు ఎప్పుడు దూరంగా ఉండే రష్మీ ఇటీవల ప్రేమించిన వాడి చేతిలో మోసపోయింది అనే విషయం బాగా వైరల్ అవుతుంది. నిజానికి బుల్లితెర ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో ఎక్కువగా సుధీర్, రష్మీ జోడిని బాగా పాపులర్ చేశారు . అంతేకాదు వీరిద్దరూ కార్యక్రమం కోసమే నటించినా నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో ఉందని, పెళ్ళి కూడా చేసుకోబోతున్నారు అని కొంతమంది ఊహగానం వ్యక్తం చేస్తే .. మరి కొంతమంది నిజంగానే పెళ్లి చేసుకోవాలంటూ రిక్వెస్ట్ చేసిన అభిమానులు కూడా ఉన్నారు.
అంతలా సుధీర్ – రష్మీ జోడి విపరీతంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్మీ ప్రేమించిన వాడి చేతిలో మోసపోయింది అనే వార్త ఒక ప్రోమో రూపంలో వైరల్ గా మారడం గమనార్హం. అసలు విషయంలోకి వెళితే ఆగస్టు 31వ తేదీన వినాయక చవితి సందర్భంగా ఈటీవీలో ఉదయం 9 గంటలకు మన ఊరి వినాయకుడు అనే కార్యక్రమాన్ని ప్రసారం చేయబోతున్నారు.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కృష్ణ భగవాన్, బాపినీడుతో పాటు ప్రముఖ హీరోయిన్ లు ఇంద్రజ , ఖుష్బూ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి తోపాటు బుల్లితెర కమెడియన్లందరూ హాజరయ్యారు.
ఇక వీరందరూ కలిసి ఆట పాటలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా కొన్ని భావోద్వేగ స్కిట్లు చేసి అందర్నీ ఏడిపించేసారని చెప్పవచ్చు. ఇక ఈ క్రమంలోనే రష్మీ పూలదండ పట్టుకొని తన బావ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఇంతలోనే ఒక ఆమె వచ్చి ఇంకెక్కడి నీ బావ నిన్ను మోసం చేసి వేరే అమ్మాయితో చట్టపట్టలేసుకొని తిరుగుతున్నాడు అంటూ చెబుతుంది ఇక దాంతో మనసు ముక్కలైన రష్మి తన బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. అంతేకాదు రష్మీ ఇచ్చిన పర్ఫామెన్స్ ఈ ప్రోగ్రాం కి హైలైట్ గా మారింది. ఇక అందుకు సంబంధించిన ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.
<iframe width=”853″ height=”480″ src=”https://www.youtube.com/embed/LOR9VH8Rqw8″ title=”Mana Oori Devudu Latest Promo-3|Vinayaka Chavithi Spl Event 2022 | 31st August 2022 |Rashmi, Indraja” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>