వైజయంతి మూవీస్ బ్యానర్​ లాంచ్​ చేసిన స్టార్స్ వీళ్లే!!

-

తెలుగు ఇండస్ట్రీలో వైజయంతి మూవీస్ బ్యానర్​కు చాలా పేరుంది.. ఇప్పటివరకు ఈ బ్యానర్​లో నటించని హీరోలు అంటూ లేరు. అలాగే ఈ బ్యానర్ పై వచ్చిన సినిమాలు అంటే ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు ఉంటాయి.. అప్పట్లో వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ నుంచి తాజాగా వచ్చిన దుల్కర్ వరకు ఈ బ్యానర్ లో నటించని స్టార్లు అంటూ లేరు. ఓ సారి ఈ బ్యానర్ ద్వారా పరిచయమైన ఈ తర్వం హీరోలు ఎవరో చూద్దాం..

  • మహేష్ బాబు.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రాజకుమారుడు చిత్రంలో మహేష్ బాబును లాంచ్ అయ్యారు.
మహేశ్
మహేశ్
  • ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్ మొదటి చిత్రం నిన్ను చూడాలని. కానీ ఆయన ముందుగా సైన్ చేసిన చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్. దీనికి వైజయంతి మూవీస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది.
ఎన్టీఆర్
ఎన్టీఆర్
  • అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మూవీకి నిర్మాణ భాగస్వామిగా వైజయంతి మూవీస్ వ్యవహరించింది.
అల్లు అర్జన్
అల్లు అర్జన్
  • నారా రోహిత్.. ఈ హీరోను కూడా బాణం సినిమా ద్వారా వైజయంతి మూవీస్ లాంచ్ చేసింది.
నారా రోహిత్
నారా రోహిత్
  • విజయ్ దేవరకొండ. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాల్లో చిన్న పాత్రలు, ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్​ లెంగ్త్ పాత్రలో నటించిన విజయ్​ దేవరకొండ కూడా ఈ బ్యానర్​పై ఎంట్రీ ఇచ్చాడు.
Vijay Devarakonda
విజయ్ దేవరకొండ
  • దుల్కర్ సల్మాన్.. మమ్ముట్టి కొడుకును తెలుగులో మహానటితో లాంచ్ చేసింది వైజయంతి నిర్మాణ సంస్థ. తాజాగా వీరి కాంబినేషన్​లో సీతారామం కూడా సూపర్​ హిట్ అయింది.
దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్
  • ఇదే చిత్రంలో సీత పాత్రలో నటించిన మృణాల్​ను తెలుగులో పరిచయం చేసింది వైజయంతి మూవీస్ సంస్థనే.

Read more RELATED
Recommended to you

Latest news