‘రౌద్రం రణం రుధిరం’ కోసం ఎన్టీఆర్ కొత్త ప్రయత్నం …?

-

ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కున్న సినిమా దర్శక ధీరుడు రాజమౌళి “ఆర్ ఆర్ ఆర్”. బాహుబలి ప్రాంఛైజీ తో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ గురించే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంటుంది. టాలీవుడ్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ‘కొమరం భీమ్’ గా రామ్ చరణ్ ‘అల్లూరి సీతారామరాజు’ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ‘రౌద్రం రణం రుధిరం’ అన్న టైటిల్ ని ఫైనల్ చేసి ఉగాది సందర్భంగా మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ తో ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా మరో బాహుబలి అంటు అందరూ చెప్పుకుంటున్నారు.
నిజంగా రాజమౌళి చరణ్ ని, తారక్ ని ఎలా చూపించబోతున్నారో ఈ టీజర్ చూసిన ప్రతీ ఒక్కరికి అర్థమైపోయింది. ఇదిలా ఉంటే ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా కోసం తారక్ ఒక రిస్క్ చేయబోతున్నాడని సమాచారం. ఈ సినిమా తమిళ, హిందీ వెర్షన్ల కి ఎన్టీఆర్ స్వయంగా తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పబోతున్నాడట.

అయితే ఇది పెద్ద రిస్క్ అంటున్నారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. తమిళ వర్షన్ కి తారక్ డబ్బింగ్ చెప్పకపోతేనే బెటర్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా భారతీయ భాషల్లోని 10 భాషలలో విడుదల కానున్నట్లు చెప్పుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ నటులతో పాటు అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ‘రౌద్రం రణం రుధిరం’ జనవరి 8న విడుదల చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news