టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా గ్రౌండ్ లెవెల్ నుండి స్టార్ హీరోగా ఎదిగాడు మాస్ మహారాజా రవితేజ. మొదటిలో వరుస విజయాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించి స్టార్ హీరోలకు పోటీ ఇచ్చాడు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. తర్వాత మళ్లీ ‘రాజాదిగ్రేట్’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన రవితేజ తర్వాత చేసిన సినిమాలు మొత్తం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటం స్టార్ట్ అయ్యాయి.
ఇటువంటి తరుణంలో రవితేజ నటించిన డిస్కో రాజా సినిమా ఇటీవల విడుదలైంది. భారీ అంచనాల మధ్య చాలా లాంగ్ గ్యాప్ తర్వాత విడుదలైన ఈ సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ కావడంతో రవితేజ కెరీర్ ఆల్మోస్ట్ ఆల్ చివరి స్టేజ్ కి వచ్చేసినట్లే అనే వార్తలు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో గట్టిగా వినబడుతున్నాయి.
అయితే రవితేజ కెరీర్ ఎలా అవటానికి గల కారణాలు అనేక రకాలుగా వినబడుతున్న ఎక్కువగా మాత్రం బాలీవుడ్ టైప్ సినిమాలు చేయాలని తన సినిమాల్లో ఉన్న సన్నివేశాలు ఆ విధంగానే చిత్రీకరించే విధంగా రవితేజ వ్యవహరిస్తారని…అదే తెలుగు ప్రేక్షకులకు నచ్చటం లేదని డిస్కో రాజా సినిమా లో కూడా అదే రేంజ్ లో బాలీవుడ్ తరహాలో సన్నివేశాలు ఉన్నాయని దీంతో సినిమా ఫ్లాప్ అయిందని కామెంట్లు గట్టిగా వినబడుతున్నాయి.