కథ :
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన అమర్ తన కుటుంబాన్ని చంపిన వారి మీగ పగ పెంచుకుంటాడు. అమర్ తండ్రి స్నేహితుడు అక్బర్ (షయాజి శిండే) ద్వారా అమర్, ఐశ్వర్య (ఇలియానా) తప్పించుకుంటారు. అయితే బ్లాస్ట్ వల్ల చనిపోయిన తన కుటుంబం వల్ల పిల్లాడైన అమర్ కు ఓ డిజార్డర్ వస్తుంది. అందుకే అతను అమర్ గా కాకుండా కొంతసేపు అక్బర్, ఆంటోనిలుగా మారుతుంటాడు. ఇక ఐశ్వర్య కూడా అమర్ కోసం వెతుకుతూ ఉంటుంది. అమర్ శత్రువులను ఎలా మట్టిపెట్టాడు. అమర్ లైఫ్ లో అక్బర్, ఆంటోని ఎవరు. ఐశ్వర్య అమర్ ఎలా కలుసుకున్నారు అన్నది సినిమా కథ.
ఎలా ఉందంటే :
కమర్షియల్ సినిమాలకు కామెడీ జోడించి హిట్ కొట్టడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల ఈమధ్య వరుస ఫ్లాపులు తీస్తున్నాడు. బ్రూస్ లీ, ఆగడు, మిస్టర్ సినిమాల ఫ్లాపుల తర్వాత శ్రీను వైట్ల సినిమా అంటే స్టార్స్ భయపడే పరిస్థితి ఏర్పడింది. అయినా సరే వెంకీ, దుబాయ్ శీనులాంటి సూపర్ హిట్లు ఇచ్చాడని రవితేజ శ్రీను వైట్లకు సినిమా ఇచ్చాడు.
అమర్ అక్బర్ ఆంటోనీ ముగ్గురిగా కనిపించే ఓ పాత్ర. మూడింటికి ఎందుకు మారుతాడు.. ఎలా మారుతాడు అన్నది కథలో భాగంగా కొత్తగా రాసుకోవాలనుకున్న శ్రీను వైట్ల ఆ పాత్రలని కామెడీ చేశాడు. పెద్దగా లాభం లేని ఈ వేరియేషన్ సినిమాకు ఏమంత ప్లస్ అవుతుందని ఆలోచించాడో. అంత పెద్ద ప్లాన్ వేసి హీరో కుటుంబాన్ని చంపేసిన విలన్స్ ఇద్దరు పిల్లలని చంపలేకపోవడం లాజిక్ లేకుండా ఉంది.
సినిమా అంతా రివెంజ్ డ్రామాగా నడవడంతో పాటుగా కథనం ఏమాత్రం ఆకట్టుకోలేదని చెప్పాలి. శ్రీను వైట్ల సినిమాల నుండి ఆశించే కామెడీ కూడా ఏమాత్ర మెప్పించలేదు. హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ లేకుండా డిజప్పాయింట్ చేశాడు. రివెంజ్ కాదు రిటర్న్ గిఫ్ట్ అంటూ డైలాగ్ రాసుకున్న శ్రీను వైట్ల ఇలాంటి సినిమాలు తీస్తే ఫ్లాపునే రిటర్న్ గిఫ్టుగా ఇస్తారని శ్రీను వైట్ల మర్చిపోయినట్టు ఉన్నాడు.
ఎలా చేశారు :
రవితేజ యాక్షన్ పరంగా పాత్ర ప్రాధాన్యతల దృష్ట్యా నటించాడు. అయితే మాస్ రాజా లోని ఎనర్జీని సరిగా వాడుకోలేదని చెప్పొచ్చు. ఆయన మార్క్ పంచ్ డైలాగ్స్.. కామెడీ చేయించలేదు. ఇలియానా ఓకే అనిపిస్తుంది. సొంత డబ్బింగ్ చెప్పడం ప్లస్ పాయింట్. హీరో, హీరోయిన్స్ మధ్య సీన్స్ ఎక్కువగా లేవు. అసలు వారి మధ్య రొమాన్స్ లేదు. కమెడియన్స్ చాలామంది ఉన్నా వారు మెప్పించలేదు. తరుణ్ అరోరా విలనిజం ఆకట్టుకోలేదు. అభిమన్యు సింగ్ ఎఫ్.బి.ఐ ఆఫీసర్ గా ఓకే అనిపించుకున్నాడు.
వెకట్ దిల్పీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా గురించి హైలెట్ గా మాట్లాడే అంశాల్లో కెమెరా వర్క్ ఒకటి. సినిమా మొత్తం యూఎస్ లో తెరకెక్కించడం వల్ల అక్కడ అందాలను బాగా చూపించారు. తమన్ మ్యూజిక్ నిరాశపరచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. మైత్రి మేకర్స్ బ్రాండ్ వాల్యూ తెలిసేలా నిరాణం ఉంది. కథ, కథనాల్లో దర్శకుడు శ్రీను వైట్ల మరోసారి ఫెయిల్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫీ
లొకేషన్స్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ రివెంజ్ స్టోరీ
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్
మైనస్ పాయింట్స్ :
బాటం లైన్ :
అమర్ అక్బర్ ఆంటోని.. శ్రీను వైట్ల రొటీన్ అటెంప్ట్..!
రేటింగ్ : 2/5