ఐశ్వర్యం కావాలా.. ఈ అభిషేకం చేయండి!

-

Do these Lord shiva abhisheks for wealth

శివుడు అభిషేక ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు. కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో శివాభిషేకాలు చాలా ప్రత్యేకం అయితే కామ్యాలు నెరవేరడానికి ఒక్కో ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో ఫలితాన్ని ఇస్తాయి. ఏ ద్రవ్యంతో ఏ ఫలితం వస్తుందో శాస్త్రవచనాలను పరిశీలిద్దాం…

క్ర.సం
పదార్థం
 ఫలం
1 ఆవునెయ్యి  ఐశ్వర్యప్రాప్తి
2 ఆవుపాలు సర్వసౌఖ్యములు
3 శుద్ధమైన నీటితో  నష్టద్రవ్యప్రాప్తి
4 భస్మాభిషేకం మహాపాపలు నశించును
5 గంధోదకం సంతానప్రాప్తి, సౌఖ్యం
6 సువర్ణోదకం  దారిద్య్ర నాశనం
7 తేనెతో తేజస్సు, యశస్సు
8 కొబ్బరినీటితో సకల సంపదలు
9 పుష్పాలతో అభిషేకం భూలాభం
10 చక్కరతో దుఖఃనాశనం
11 మారేడు బిల్వాలతో భోగభాగ్యాలు
12 చెరుకు రసంతో ధనవృద్ధి
13 నువ్వుల నూనెతో అపమృత్యుదోష నివారణ, శనిశాంతి కలుగును
14 అన్నాభిషేకం అధికారప్రాప్తి
15 పసుపు, కుంకుమలతో శుభాలు కలుగును

అయితే పై ద్రవ్యాలతో అభిషేకం చేసిన తప్పక ఆయా ఫలితాలు కలుగుతాయి. కానీ చేసే పూజలో భక్తి, శ్రద్ధ, విశ్వాసం అత్యంత అవసరమని శాస్ర్తాలు పేర్కొన్నాయి. చిత్తశుద్ధిలేని శివుని పూజలేల. అన్న చందాన కాకుండా చిత్తశుద్ధితో హరహరా అని శుద్ధ జలంతో అభిషేకించి, చిటికెడు బూడిదను శ్రద్ధతో సమర్పించి, మారేడు దళాన్ని భక్తితో భోళాశంకరుడిపై వేస్తే చాలు ఐశ్వర్యం, ఆరోగ్యం తప్పక మీ సొంతం అవుతుంది. సర్వైశ్వర్య, ఆరోగ్యకారకుడే కాకుండా చెడునంతా లయం చేయగలిగిన లయకారకుడు ఆ ఆది భిక్షువు సర్వమంగళకారకుడు శంకరుడు. సదా శివోహం శివోహం.

– కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

 

Read more RELATED
Recommended to you

Latest news