మహేష్ బాబు సినిమాపై రేణు క్లారిటీ వచ్చేసింది!

-

అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో ‘మేజర్’ అనే చిత్రాన్ని మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ మరియు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ సంయుక్తంగా నిర్మిస్తోంది. 26/11 ముంబై దాడుల్లో టెర్రరిస్టులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో ఈ చిత్రం రూపొందుతోంది. అయితే ఇందులో ఓ కీలక పాత్రలో రేణు దేశాయ్ కనిపించబోతుండంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా దీనిపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. తన జీవితంలో టఅని విన్న అతి పెద్ద రూమర్ ఇదేనని అన్నారు.

ఈ విషయమై ఇప్పటికే తనకు చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని, తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆమె, మహేశ్ బాబుతో సినిమాకు, తనకు ఎటువంటి సంబంధమూ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంత పెద్ద చిత్రంలో తనకు నటించే అవకాశం వస్తే, తానే ప్రకటన చేసుండేదాన్నని, తనకు కూడా నటించాలని ఉందని, గతంలో ఎప్పుడో మదర్ రోల్స్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు, హీరోల చిన్నప్పటి పాత్రలకు తల్లిగా చేసేందుకు అంగీకారం తెలిపానని, దాని ఆధారంగానే ఈ తప్పుడు రూమర్ పుట్టుండవచ్చని అన్నారు. ఏది ఏమైనా ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news