లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్.. మహానాయకుడుతో లింక్..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా ఆర్జివి తీస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాను ఆఫ్టర్ రిలీజ్ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాని రిలీజ్ ముందు మాత్రం బీభత్సమైన పబ్లిసిటీ చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా ఫ్లాప్ అవడం వర్మకు కలిసి వచ్చిన అంశమే. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ తో కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ ను టార్గెట్ చేస్తున్నాడు వర్మ. మహానాయకుడు రిలీజ్ డేట్ ను బట్టి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ రిలీ ఆధారపడి ఉంటుందని అంటున్నాడు వర్మ.

టెక్నికల్ గా.. సైకలాజికల్ గా.. వీటికి ఎమోషనల్ రీజన్స్ ఉన్నాయి..లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ మహానాయకుడు రిలీజ్ డేట్ ప్రకటించిన 24 నిమిషాల తర్వాత రిలీజ్ చేయమని స్వర్గం నుండి స్వర్గం నుండి ఎన్.టి.ఆర్ హెచ్చరించారని.. తనయుడు కథానాయకుడు సినిమా ఎన్.టి.ఆర్ దీవించలేదు కాబట్టి భార్య లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై ఆయన తప్పకుండా దీవిస్తారని ట్వీట్ చేశాడు వర్మ.

లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఆర్జివి చేస్తున్న ఈ ప్రమోషన్ ఆ సినిమాకు ప్లస్ అవడం పక్కన పెడితే.. మహానాయకుడు సినిమా మీద ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. చూస్తుంటే వర్మ ఎన్.టి.ఆర్ మహానాయకుడు రోజునే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ ఫిక్స్ చేసేలా ఉన్నాడు ఆర్జివి. ఒకేరోజు రెండు ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాలు ఆడియెన్స్ కు మాత్రం భలే థ్రిల్ అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news