పవర్ స్టార్ హీరోయిజం నుంచి జీరోయిజం: RGV

-

సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు విడుదల కాకున్నా.. ఆయన సినిమాలలో నటించకపోయిన సరే నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. సాధారణంగా తమ గురించి అందరూ మాట్లాడుకోవాలని ఆశించే వారు అధికంగా ఉంటారు కానీ అందుకోసం ఏం చేయాలో తెలియదు కానీ తెలివైన వారు మాత్రం ఏదో విధంగా తాము తరచు వార్తల్లో ఉండేలా చూసుకుంటారు.

అలాంటి వారిలో రాంగోపాల్ వర్మ కూడా ఒకరు. అయితే, తాజాగా ముఖ్యమంత్రిగా తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేయడం పై డైరెక్టర్ ఆర్జీవి సెటైర్లు వేశారు. ‘పవర్ స్టార్ కన్నీళ్ళతో ఒక్క ఛాన్స్ అంటూ ఆడుక్కుంటున్నారు. దీంతో అభిమానులు, కులస్తుల గుండెల్లో ఆయన స్థాయి హీరోయిజం నుంచి జీరోయిజానికి తగ్గిపోతోంది’ అని ట్విట్ చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు RGV పై ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news