జోహార్ చంద్రబాబు నాయుడు అట… వీళ్ల తెలివి తెల్లార? వీడియో

-

రెండుమూడు సార్లు జోహార్ చంద్రబాబు అని అన్నాక.. అక్కడున్న వాళ్లలో ఒకరికి డౌట్ వచ్చింది. మనం జై చంద్రబాబు అంటున్నామా? లేక జోహార్ అంటున్నామా? అని అనేసరికి.. అక్కడున్న టీడీపీ నేతలంతా తమలో తామే నవ్వుకున్నారు.

పండిత పుత్ర పరమ శుంఠ.. అన్నారు పెద్దలు. అట్లనే ఉన్నది టీడీపీ నేతల వ్యవహారం కూడా. ఇప్పటికే టీడీపీలో నారా లోకేశ్ బాబు వ్యవహారంతో తలపట్టుకొని కూర్చున్న చంద్రబాబుకు టీడీపీ నేతలు అప్పుడప్పుడు ఝలక్ ఇస్తున్నారు. దీంతో వీళ్లతో ఎలా వేగాలిరా దేవుడా అని అనుకుంటున్నారు చంద్రబాబు.

tdp leaders hails cm chandrababu with johar

ఎందుకంటే ఇటీవల… గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన టీడీపీ నేతలు.. ఏవో వేడుకలు జరుపుకుంటున్నారు. కేక్ కూడా కట్ చేశారు. మరి.. ఆ వేడుకలు దేనికి అనేది మాత్రం తెలియదు. అది మనకు అనవసరం కూడా. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే… వాళ్లు కేట్ కట్ చేశాక… సాధారణంగా వాళ్ల నాయకుడిని పొగడాలి కదా. ఆ పొగడటం కాస్త ఎక్కువైందన్నమాట. అందుకే.. జై చంద్రబాబు అనబోయి.. జోహార్ చంద్రబాబు అని అన్నారు. జోహార్ ఎవరికి వాడతారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.

ఇలా… రెండుమూడు సార్లు జోహార్ చంద్రబాబు అని అన్నాక.. అక్కడున్న వాళ్లలో ఒకరికి డౌట్ వచ్చింది. మనం జై చంద్రబాబు అంటున్నామా? లేక జోహార్ అంటున్నామా? అని అనేసరికి.. అక్కడున్న టీడీపీ నేతలంతా తమలో తామే నవ్వుకున్నారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news