ఓ తాతగారూ మీరింకా వున్నారా? – VH ను ట్రోల్ చేసిన ఆర్జీవీ

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. వివాదాలను క్రియేట్ చేసి అలా సంచలనాలు రేపుతుంటారు. అయితే.. తాజాగా సంచలనానికి తెర తీశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

కాంగ్రెస్‌ పార్టీ నేత వి. హనుమంత రావు ను ఉద్దేశించి.. ట్వీట్‌ చేశారు ఆర్జీవీ. ఏపీలో జరిగిన ఓ కార్యక్రమంలో.. మహిళలపై ఆర్జీవీ మాట్లాడిన మాటలపై జగన్‌ చర్యలు తీసుకోవాలని కోరారు వీహెచ్‌. అయితే.. దీనికి వర్మ కౌంటర్‌ ఇచ్చారు. ఓ తాతగారూ మీరింకా వున్నారా??? అంటూ సెటైర్‌ వేశారు. NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్ ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్ కి ఆ గతి.. ఒక సారి డాక్టర్ కి చూపించుకొండని ఫైర్‌ అయ్యారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news