పెళ్లికి సిద్ధమైన రాకింగ్ రాకేష్ – సుజాత .. ఎప్పుడంటే..?

-

జబర్దస్త్ వేదికపై తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రాకింగ్ రాకేష్ మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక జోర్దార్ సుజాత గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. నాగార్జునను బిట్టు అని పిలవడంతో విమర్శలను కూడా మూటగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం జబర్దస్త్ షోలో స్కిట్లు చేయడం ద్వారా జోర్దార్ సుజాత ఎప్పటికప్పుడు పాపులర్ అవుతూ ఉంటుంది . రాకేష్ టీం తో కలిసి సుజాత చేసే స్కిట్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఇక సుధీర్ , రష్మీ జోడీ లాగే రాకేష్ – సుజాత జోడి కూడా మిగిలిపోతుందని అందరూ ఫిక్స్ అయ్యారు.కొన్ని రోజుల క్రితం రాకేష్ – సుజాతల నిశ్చితార్థం జరగడంతో ఇక వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అని నిర్ణయానికి వచ్చారు. ఇక సుజాత కూడా రాకేష్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరుపుకోవడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కపోతున్నారు అనే వార్త ఇటీవల వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. 2023 ఫిబ్రవరి నెలలో రాకేష్ – సుజాతల వివాహం జరగబోతుందని అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక మన ఊరి దేవుడు కార్యక్రమంలో గెటప్ శ్రీను రాకేష్ – సుజాతల పెళ్లి గురించి వెల్లడించి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు..జబర్దస్త్ రాకింగ్ రాకేష్‌ను బకరా చేసిన జోర్దార్ సుజాత.. ఇంటికి పిలిచి అలాంటి షాక్ | Jabardasth fame Racking Rakesh's home tour of Jordar Sujatha - Telugu Filmibeatఇక అంతేకాదు రాకేష్ – సుజాత ఇద్దరూ తమ ప్రేమను గెలిపించుకున్నారు అంటూ నెటిజన్స్ కూడా వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రాకేష్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను నచ్చే విధంగా స్కిట్లను చేస్తూ మంచి ప్రాధాన్యతను సొంతం చేసుకున్నారు. ఇక వీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని వీరి జంట ఇలాగే కలకాలం ప్రేక్షకులకు కామెడీని పంచాలి అని కోరుకుంటూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news