RRR : మార్చి 19న ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

-

‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్‌ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది రాజమౌళి టీం. ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై తాజాగా అఫిషియల్ అనౌన్స్మెంట్ చేశారు. మార్చి 19న సాయంత్రం 6 గంటలకు కర్ణాటకలోని చిక్కబల్లాపురలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా.. ‘ఆర్ఆర్ఆర్’ టీం ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

కాగా.. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు నాలుగు ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు భార‌త దేశంలోనే దిగ్గ‌జ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్న ఎస్ ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇండియాలో గ్రెట్ డైరెక్ట‌ర్, తెలుగు తో పాటు ఇత‌ర భాషాల‌లో మంచి గుర్తింపు ఉన్న హీరోల కాంబినేషన్ లో వ‌స్తున్న ఈ సినిమా.. ఎన్నో అంచ‌నాల‌తో ఈ నెల 25వ తేదీన విడుద‌ల కాబోతుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news