ఆస్కార్ లిస్టులో ఎన్టీఆర్, రామ్ చరణ్ !

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం RRR ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇక ఈ సినిమా స్టోరీ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్రలు పోషించిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలయికలో సాగే ఇటువంటి ఒక పీరియాడికల్ స్టోరీ గా చిత్రీకరించారు. ఈ చిత్రం మార్చి లో విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రూ.1100 కోట్లకు మించి వసూళ్ళు రాబట్టింది. అలాగే.. రాజమౌళి ‘RRR’ సినిమా కలెక్షన్ రాబట్టడంతో పాటు ఓటీపీ ప్లాట్ ఫామ్, నెట్ ఫ్లిక్స్ లో ఎక్కువ రోజులు ట్రెండింగ్ లో ఉండి రికార్డు సృష్టించింది. దీంతో పాటు కొన్ని రోజుల క్రితం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘వెరైటీ’ మ్యాగజైన్ RRR ను నామినేట్ చేసింది. తాజాగా, మరోసారి ‘ఉత్తమ నటుడు’ కేటగిరీలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు, బెస్ట్ డైరెక్టర్ లో రాజమౌళికి ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తూ జాబితాని రిలీజ్ చేసింది.