సాయి పల్లవితో సాయి పల్లవి గెలిచింది..!

-

టైటిల్ కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజం.. మళయాళ ప్రేమంతో మనసులు గెలిచిన సాయి పల్లవి తెలుగులో ఫిదాతో ఆడియెన్స్ ను ఫిదా అయ్యేలా చేసింది. ఇక అమ్మడు చేస్తున్న సినిమాల్లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే ఆమె డ్యాన్స్.. ఫిదాలో వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఫిదా హిట్ లో ప్రధానంగా చెప్పుకునే ఆ సాంగ్ 2017 లో అప్లోడ్ చేస్తే ఇప్పటివరకు 182 మిలియన్ వ్యూస్ సాధించింది.

ఇక తమిళంలో సాయి పల్లవి చేసిన మారి-2 మూవీలో రౌడీ బేబీ సాంగ్ కూడా యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. ఈ సాంగ్ నెల రోజుల్లోనే 183 మిలియన్ వ్యూస్ సాధించింది. అంటే సాయి పల్లవి తన పాటలతో తానే పోటీ పడుతున్నదన్నమాట. వచ్చిండే సాంగ్ 18.2 కోట్లు వ్యూస్ సాధించగా.. నెల రోజుల్లోనే 18.3 కోట్ల వ్యూస్ తో రౌడీ బేబీ సత్తా చాటింది. సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సాయి పల్లవి ఈ రకంగా కూడా క్రేజ్ తెచ్చుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news