వెంకటేశ్, చిరంజీవితో సల్మాన్ ఖాన్ సరదా ముచ్చట్లు..ఎక్కడంటే?

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నారు. ‘కబీ ఈద్ కబీ దివాళి’ ఫిల్మ్ షూటింగ్ నిమిత్తం తెలంగాణలోని హైదరాబాద్ కు వచ్చిన సల్లూ భాయ్…షూటింగ్ ముగించుకున్న తర్వాత తన స్నేహితులను కలుసుకుంటున్నారు.

తాజాగా టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ లను కలిసి వారితో సరదాగా టైమ్ స్పెండ్ చేశాడు. వారితో సరదాగా సంభాషించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్లూ భాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో వీరిరువురికి ఓ పాట కూడా ఉంది. దానిని ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇకపోతే సల్మాన్ భాయ్ ‘బాడీ గార్డ్’ చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేశ్ రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు. ఒకే ఫ్రేమ్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్, వెంకటేశ్ లను చూసి అభిమానులు సంబురపడిపోతున్నారు.