సమంత సంచలన నిర్ణయం.. వారిపై కోర్టులో పరువు నష్టం దావా !

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, అక్కినేని మాజీ కోడలు సమంత కోర్టు ఆశ్రయించారు. తన పరువు కు భంగం కలిగేలా వ్యవ హించారంటూ ఏకంగా మూడు యూట్యూబ్ చానల్స్ పై హీరోయిన్‌ సమంత పరువు నష్టం దావా వేశారు. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ మరియు టాప్ తెలుగు టీవీ పై పరువు నష్టం దావా వేశారు సమంత.

తన వ్యక్తి గత జీవితం గురించి.. చాలా అసభ్య కరంగా వీడియోలు చేస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు సమంత. వాళ్లు చేసే వీడియోల కారణంగా తన గౌరవం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు సమంత. ఈ మూడు యూ ట్యూబ్‌ చానెళ్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు లో పేర్కొన్నారు. సమంత వేసిన ఈ పరువు నష్ట దావా పై కాసేపట్లో కూకట్ పల్లి కోర్టులో విచారణ జరుగనుంది. కాగా… అక్కినేని నాగా చైతన్య మరియు సమంత గత మూడు వారాల కింద విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.