జగన్.. ఆ ఎమ్మెల్యేలని సైడ్ చేయకపోతే కష్టమే!

-

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్ళు కాలేదు. కానీ ఈలోపే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు పలు సర్వేలు వస్తున్నాయి. సీఎంగా జగన్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. ఆయనపై ప్రజా వ్యతిరేకత పెద్దగా రావడం లేదు. కానీ తన ఎమ్మెల్యేలపై మాత్రం వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే పలు సర్వేల్లో దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వారు ఓడిపోవడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి.

Ys-Jaganmohan-Reddy
Ys-Jaganmohan-Reddy

అయితే నేషనల్ సర్వేల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ‘ఐఏఎన్‌ఎస్‌ – సీ ఓటర్‌ పరిపాలన సూచీ’ పేరిట వచ్చిన సర్వే ప్రకారం దేశంలో అత్యధిక వ్యతిరేకతని ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల్లో ఏపీ ఎమ్మెల్యేలు టాప్‌లో ఉన్నారని తేలింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలపై 28.5శాతం మంది ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిసింది. ఇక రాష్ట్రంలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో వైసీపీకి 151…ఇక టి‌డి‌పి, జనసేనల నుంచి ఎమ్మెల్యేలని కలుపుకుంటే మొత్తం 156 మంది..అంటే టి‌డి‌పికి ఉన్నది 19 మంది ఎమ్మెల్యేలే.

దీని బట్టి చూస్తే ఎక్కువ వ్యతిరేకత వైసీపీ ఎమ్మెల్యేలపైనే అని క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ సర్వే ప్రకారం చూసుకున్న దాదాపు 50 మంది వరకు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని అర్ధమవుతుంది. అయితే అలా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలపై ఫోకస్ చేసి జగన్, వారిని సెట్ చేయాల్సి ఉంది. లేదంటే నెక్స్ట్ ఎన్నికలకు ఇంకా వ్యతిరేకత పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి.

ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉంది. ఈలోపు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని జగన్ పక్కనబెట్టేస్తే పార్టీకి మంచింది. లేదంటే వైసీపీకే డ్యామేజ్ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news