Samantha Ruth Prabhu: తెలుగు నుంచి సమంతకు అరుదైన గౌరవం

-

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్‌ సమంత.. ప్రస్తుతం దేశ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఏ మాయ చేసావే అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెలను మాయ చేసింది. మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న సమంత ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇకపోతే తన నటనతో, అమాయకత్వంతో, చిలిపిచేస్టలతో స్టార్ హీరోల సినిమాలలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న సమంత ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా.. సమంత సినిమాలతో బిజీగా ఉంది.

నటిగా సమంత పాపులారిటీ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా దూసుకుపోతోంది. ఇక తాజాగా సమంతకు ఓ అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌ నగరంలో జరిగే ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిలిం ఫెస్టివల్‌ కు ముఖ్య అతిథిగా హాజరు కావాలని సమంతకు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమం ఆగస్టు 12 వ తేదీన జరుగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news