‘జాను’ ట్రైలర్ :  అంచనాలు అందుకునేలా ఉందే…..!!

-

అక్కినేని సమంత, శర్వానంద్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తాజా సినిమా జాను. కొన్నాళ్ల క్రితం కోలీవుడ్ లో విజయ్ సేతుపతి, త్రిషల కలయికలో వచ్చిన 96 అనే ప్యూర్ లవ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ మాతృకను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఇక తమిళ్ లో రిలీజ్ అయిన 96 మూవీ అప్పట్లో పెద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో,

తప్పకుండా ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ఈ సినిమా హక్కులు కొన్నాడు. ఇకపొతే ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ప్రాణం, ఊహలే అనే పల్లవులతో సాగె రెండు సాంగ్స్ యూట్యూబ్ లో రిలీజ్ అయి శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఇక ట్రైలర్ ని బట్టి చూస్తే 96 మూవీ మాదిరిగా ఈ సినిమాలో కూడా హీరో, హీరోయిన్లు ఇద్దరూ కూడా తమ పెర్ఫార్మన్స్ అదరగొట్టారనే చెప్పాలి. ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన ఎమోషన్స్,

 

లవ్ సీన్స్ ని బట్టి చూస్తే ఈ సినిమాకు యువత బాగా కనెక్ట్ అవుతారని చెప్పవచ్చు. ఇక విజయ్ సేతుపతి పాత్రలో శర్వా, అలానే త్రిష పాత్రలో నటించిన సమంత, ఎంతో బాగా నటించారనే చెప్పాలి. ఇక ఇప్పటికే సంగీత దర్శకుడు గోవింద్ వసంత అందించిన సాంగ్స్ మంచి హిట్ అవ్వగా, ప్రస్తుతం ట్రైలర్ లో ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. మొత్తంగా ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే, తప్పకుండా ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా మంచి హిట్ కొట్టేలా కనపడుతోంది. మరి ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news