Samantha : సెట్‌లో సమంత దొంగతనం.. వీడియో వైరల్ !

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత… విడాకుల తర్వాత ఎంజాయింగ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తుంది. ముఖ్యంగా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం యశోద మూవీ సెట్‌ లో ఫుల్‌ జోష్‌ గా పాల్గొంటుంది. షూటింగ్‌ లో పాల్గొంటూనే… అక్కడి ఫన్నీ వీడియోలను షేర్‌ చేస్తోంది సామ్‌.

ఇందులో భాగంగానే నిన్న తన హెయిర్‌ స్టయిలిస్ట్‌ ప్రీతమ్‌ జుట్టును సమంత కట్ చేసింది. అలా తాను హెయిర్‌ కట్‌ చేసినందుకు డబ్బులు చెల్లించలేదంటూ సమంత కొంటె కామెంట్లు చేసింది. ఇక సమంత చేసిన పనికి, తన జుట్టును కత్తిరించడంపై ప్రీతమ్‌ అయ్యే అనుకున్నాడు. ఇక తాజాగా మరో పోస్టు చేసింది సమంత.

యశోద సెట్‌ లో సమంత ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తోందని ఈ వీడియో చూస్తే.. అర్థమౌవుతుంది. సెట్‌ లో ఉన్నప్రాపర్టీ, ఫుడ్‌ ను దొంగిలించే ప్రయత్నం చేసింది సమంత. ఫుడ్‌ ను తినాలని సమంత ప్రయత్నించినట్టుంది. కానీ ఇంతలోనే ఆ ప్రయత్నం విఫలమైంది. ఈ మేరకు సమంత తన ఇన్‌ స్టా లోపోస్టు చేసింది. అది కాస్త వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news