RRR: ట్విట్లర్లో సూపర్ హిట్ టాక్…. బ్లాక్ బస్టర్ అంటున్న నెటిజన్లు

-

దేశవ్యాప్తంగా చాలా అంచానాలు మధ్య ఈ రోజు విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. దీంతో పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటన సూపర్ అంటూ కితాబు ఇస్తున్నారు. హిందీ బెల్ట్ లో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఈరోజు దేశవ్యాప్తంగా ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో విడుదల అయింది. బాహుబలి కన్నా ఎక్కువగా హిట్ అవుతుందని జోస్యం చెబుతున్నారు. హిందీలో రూ. 300 కోట్ల వసూళ్లను మించిపోతుందని నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. రామ్ చరన్, జూనియర్ ఎన్టీఆర్లకు ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరుగుతుందని ట్విట్ చేస్తున్నారు. 5/5 రేటింగ్స్ ఇస్తున్నారు నెటిజెన్లు. విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లేకు, రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనకు సూపర్ రేటింగ్స్ ఇస్తున్నారు. ఇంటర్వెల్ సీన్స్, క్లైమాక్స్ నెక్ట్ లెవల్ అంటూ ప్రశంసిస్తున్నారు. దాదాపుగా మూడేళ్ల శ్రమకు ఫలితం దక్కిందంటూ సినిమాను పొగుడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news