టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె ఏమాయే చేశావో సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అప్పటి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగింది. అయితే టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న కొద్ది సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు.
విడాకుల తరువాత సమంత పలు సినిమాల్లో నటించింది. అయినప్పటికీ మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. ఇటీవలే నాగచైతన్య-శోభితకు ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ తరుణంలో సమంత ఇన్ స్టాలో ఓ ఆసక్తికర పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ అవుతోంది. “ఈరోజు ప్రత్యేక విషయాన్ని చెబుతాను ఎదురు చూడండి” అని రాసుకొచ్చింది. సమంత దేని గురించి చెబుతారో అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. సమంత తన పెళ్లికి సంబంధించిన వార్త లేదా ఆరోగ్యానికి సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఏ విషయం గురించి చెబుతుందో తెలియాలంటే మరికొద్ది సేపు వెయిట్ చేయాల్సిందే..!