షాకింగ్ న్యూస్ చెప్పిన హీరోయిన్ సమీరా రెడ్డి… తనకు ఆ వ్యాధి ఉందని వెల్లడి

హీరోయిన్ సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పలు సినిమాలతో ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే తాజాగా సమీరా రెడ్డి షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. తనకు ఓ అరుదైన వ్యాధి ఉన్నట్లు వెల్లడించింది. తాను ‘ అలోపేసియా’ వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించింది. జట్టుకు సంబంధించిన ఈ వ్యాధికి గురైనట్లు వెల్లడించింది. 2016లోనే తాను ఈ వ్యాధికి గురైనట్లు రివీల్ చేసింది. ‘ నా భర్త అక్షయ్ నా తలపై రెండు ఇంచుల జుట్టు ఊడిపోవడాన్ని గమనించారని.. ఈ వ్యాధి ఎదుర్కోవడం చాలా కష్టమని, అనారోగ్యానికి గురిచేయదు కానీ.. మానసికంగా బాగా కుంగదీస్తుందని’ సమీరా రెడ్డి తెలిపింది. 

సమీరా రెడ్డి తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ‘ జై చిరంజీవ’,  ఎన్టీఆర్ తో నరసింహుడు, అశోక్ సినిమాలను చేసింది. సూర్యతో గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో సూర్య సన్నాఫ్ క్రిష్ణన్ సినిమా చేసింది. అయితే తెలుగులో పెద్దగా హిట్లు లేకపోవడంతో తమిళంలో అడపాదడపా సినిమాలు చేసింది. ఆతరువాత ముంబైకి చెందిన అక్షయ్ ను పెళ్లి చేసుకుంది.