విశ్వక్ సేన్ ” ఓరి దేవుడా” నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

-

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్న హీరో లు చాలా తక్కువగా ఉంటారు. ఫలక్ నుమా దాస్… సినిమాతోనే పెద్ద స్టార్ అయిపోయాడు విశ్వక్ సేన్. చేసింది మొదటి సినిమా అయినప్పటికీ… యాక్టింగ్ లో ఎక్కడ తగ్గకుండా కుమ్మేశాడు విశ్వక్.ఈ సినిమాతోనే యూత్ లో మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.

ఆ తరువాత పాగల్, అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతో మంచి విజయం అందుకున్న విశ్వక్సేన్ మరొక సినిమాను అనౌన్స్ చేశాడు. ఎప్పుడూ సీరియస్ కథలను ఎంచుకునే విశ్వక్సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణం వంటి పూర్తి వినోదాత్మక చిత్రంతో వచ్చి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం “ఓరి దేవుడా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన ” ఓ మై కడువలే” చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఒరిజినల్ వర్షన్ ను తెరకెక్కించిన అశ్వత్ మరిముత్తు రీమేక్ చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ దేవుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు వంశీ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మిథిలా పల్కర్ నటిస్తోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుండి ఓ అప్డేట్ ని ప్రకటించారు. ఈ మూవీలోని సెకండ్ సింగిల్ ” అవుననవా” అంటూ సాగే మెలోడియస్ సాంగ్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ సాంగ్ లో హీరో, హీరోయిన్ ఓ లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ పాటలో ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి లియాన్ జేమ్స్ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news