భానుప్రియ కష్టాలు: డైలాగ్స్, డాన్స్ మరచి పోయి !

తెలుగు సినిమా ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్ భానుప్రియ అంటే ఆమె యొక్క చారడేసి కళ్ళు, ఆమె అందమైన నాట్యం మాత్రమే కళ్ళకు మెదులు తాయి. గతంలో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ  ఓ స్టార్ హీరో భానుప్రియ డ్యాన్సులు, న‌ట‌న‌లో తన‌ను క్రాస్ చేస్తుంద‌నే త‌న సినిమాల్లో ఆమె వద్దని చెప్పారని, తర్వాత ఆ స్టార్ హీరో తనకు బాగా ఇష్టం అయిన మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ లకే  ఎక్కువ ఛాన్స్ ఇచ్చారని ప్రచారం జరిగింది.

ఇంకో కథనం  ప్రకారం ఆ స్టార్ హీరోతో పాటు మ‌రో బడా ప్రొడ్యుస‌ర్ ఇద్ద‌రూ క‌లిసి భానుప్రియ‌ను కమిట్ మెంట్ అడిగారని, దానికి  భానుప్రియ ఒప్పుకోలేదట . దీంతో వారు ఆమెకు ఛాన్సులు రాకుండా చేశారట. వాస్తవానికి భానుప్రియ‌కు అందంతో పాటు , నటన డ్యాన్సుల్లో టాలెంట్ వున్నా ఆమె  స్టార్ హీరోయిన్ కాకుండా తొక్కేసారని ప్రచారం వుంది. ప్రస్తుతం ఆమెలాంటి వారు తల్లులు గా, మంచి కారెక్టర్ లు వేస్తుంటే ఆమె మాత్రం ఎక్కడా చడీ చప్పుడు లేకుండా పోయింది. ఇది ఎంట్రా అని ఆరా తీయగా ఆమె తనకు మతిపరుపు, గుర్తు లేక పోవడం వంటి సమస్యల తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

తాజా ఇంటర్వ్యూలో భానుప్రియ మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. తనకు మెమరీ లాస్ ఇబ్బంది ఉన్నట్టు ఆమె వెల్లడించింది. భాను ప్రియ మాట్లాడుతూ.. మావారు చనిపోయారు అప్పటి నుంచి నేను  చాలా ఇబ్బందుల్లో పడ్డాను. ముఖ్యంగా ఆరోగ్యం పాడయ్యింది..డైలాగ్స్ కూడా గుర్తుండటం లేదు. డాన్స్ స్టెప్స్ కూడా అన్ని. మర్చి పోయాను అంటూ షాకింగ్ కామెంట్స్ విషయం రివిల్ చేసింది.

 

ఆ స్టార్ హీరోల తో తమన్నా ఆ తప్పు చేసిందా?.. అందుకే భయపడుతుందా?