RRR టీమ్​కు సినిమాటోగ్రాఫర్ సెంథిల్ గ్రాండ్ పార్టీ.. ఫొటోస్ వైరల్

-

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చుకుందో మనకు తెలిసిందే. ఏకంగా ఆస్కార్ బరిలో కూడా నిలిచి పురస్కారాన్ని గెలిచింది. మరెన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీకి ఆస్కార్ వచ్చిన నేపథ్యంలో చిత్ర సినిమాటోగ్రాఫర్ సెంథిల్‌ కుమార్‌ గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని సెంథిల్‌ నివాసంలో జరిగిన ఈ పార్టీలో చిత్ర బృందం సందడి చేసింది. నటుడు రామ్‌చరణ్‌, దర్శకధీరుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ, సంగీత దర్శకుడు కీరవాణి, వారి కుటుంబాలు, ఇతర సెలబ్రిటీలు ఈ వేడుకలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను సెంథిల్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘‘’ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌ పార్టీలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల ఫిక్షనల్‌ స్టోరీతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తెరకెక్కింది. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా నటించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. సుమారు 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news