అందాల ముద్దుగుమ్మ శివాత్మిక రాజశేఖర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఈ బ్యూటీ ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన దొరసాని అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీలో శివాత్మిక తన అద్భుతమైన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసు దోచుకుంది.
ఆ తర్వాత మాత్రం క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో కాస్త స్లో అయింది. ఇక ఇటీవల శివాత్మిక బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే.
క్రమక్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ నేటిజెన్లకి పిచ్చెక్కిస్తుంది. సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది.