1,061 పోస్టులకు ఈ నెల 22న నియామక ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు…ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. నాణ్యమైన వైద్యం, వైద్య విద్యకు హబ్ గా తెలంగాణ అని వివరించారు.
కేసీఆర్ లక్ష్యం మేరకు పేదలకు వైద్యంతో పాటు విద్యార్ధులకు వైద్య విద్య అందుతోందని చెప్పారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ గారి లక్ష్య సాధనకు కృషి చేయాలని.. ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించాలన్నారు మంత్రి హరీశ్ రావు. 1069 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఈ నెల 22న నియామక ఉత్తర్వుల అందజేస్తామని.. ర్యాగింగ్ నియంత్రణ పాటించాలి. విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.