ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నాగార్జున రెండవ భార్యగా అమల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె నాగార్జున భార్యగా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఇప్పటికీ అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. నాగార్జునతో శివ, నిర్ణయం వంటి చిత్రాలలో కలిసి నటించిన ఈమె అక్కడే అతడిని ప్రేమించి వివాహం చేసుకుంది. ఇక నాగార్జున తో వివాహం తర్వాత సినీ పరిశ్రమకు దూరమైన అమల బ్లూ క్రాస్ అనే ఒక జంతువుల పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించి.. తనకు మూగజీవాల పై ఉన్న ప్రేమను చాటుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం అమల తల్లిదండ్రుల గురించి ఒక వార్త బాగా వైరల్ గా మారుతోంది. అదేమిటో ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం..
అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ. తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్ ముఖర్జీ. అయితే వీరిద్దరు ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. ఇకపోతే నేవీ ఆఫీసర్ గా పనిచేసిన అతను ఆ తర్వాత డిప్యుటేషన్ మీద ఐఐటి ఖరగ్పూర్లో ప్రొఫెసర్ ఉద్యోగం సంపాదించారు. అమల తల్లి మహిళా మెహ్యు హాస్పిటల్ లో మేనేజ్మెంట్ జాబ్ చేసేవారు. ఇక వివాహం అనంతరం అమల తల్లిదండ్రులు వైజాగ్ , చెన్నై వంటి ప్రదేశాలలో చాలావరకు జీవనం కొనసాగించారు. అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన వారు కాబట్టి అమలను నాగార్జున వివాహం చేసుకుంటున్న సమయంలో కూడా పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితమయ్యాయి.వివాహానికి ముందు సుమారుగా 50 చిత్రాలలో తమిళ్, మలయాళం , తెలుగు చిత్రాలలో నటించిన ఈమె పెళ్లి తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి చిత్రాలలో తల్లి పాత్ర పోషించింది. ఇకపోతే ఈమెకు మలయాళం సినిమాల ద్వారా నంది అవార్డు కూడా లభించింది.