ఇంట్రెస్టింగ్ : RRR చిత్రంపై శ్రియ క్లారిటీ.. ఆ పాత్రలో కనిపిస్తుందట..!

-

బాహుబలి వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేస్తున్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, చ‌రణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వాయిదాపడ్డ ఈ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ శ్రియ కూడా నటిస్తోందని.అయితే దీనిపై శ్రియ క్లారిటీ ఇస్తూ.. తాను ఇందులో అతిథి పాత్ర మాత్రమే చేస్తున్నానని స్పష్టం చేసింది.

రాజమౌళితో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. 2005లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి మూవీలో శ్రియ నటించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. దాదాపుగా 80 శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను అన్ని జాగ్ర‌త్త‌లతో  సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో జక్కన్న ఉన్న‌ట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news