శ్రియ స్టన్నింగ్ లుక్స్… ఫిదా అవుతున్న నెటిజన్లు

-

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దు గుమ్మ శ్రియ(Shriya) గురించి తెలియని టాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. అంతలా ఈ బ్యూటీ ప్రేక్షకులను మాయ చేసింది. ఇండస్ర్టీలో ఉన్నన్ని రోజులు తన పరువాలతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ చిన్నది పెళ్లి చేసుకున్నాక కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల నిద్ర చెడగొడుతుంది. ఆమె తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫొటో వైరల్ గా మారింది. ఇది చూసిన వారు కామెంట్ చేయలేకుండా ఉండలేకపోతున్నారు. టాలీవుడ్ కి శ్రియ ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఎలాగైతే హాట్ గా ఉందో ఇప్పుడు కూడా మతి పోగొట్టేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అసలు గత 20 ఏళ్లుగా శ్రియ వయసే పెరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అమ్మడు ప్రస్తుతం ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ… బిజీగా గడుపుతోంది. అంతే కాకుండా తన భర్తతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ అమ్మడు పోస్ట్ చేసే ఫొటోల్లో ఎక్కువ భాగం వైరల్ గా మారుతాయి. తన భర్తతో కలిసి రొమాన్స్ చేసే ఫొటోలను కూడా ఈ అమ్మడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ పోస్ట్ చేసిన ఫొటోల్లో ఇష్టం సినిమాలో ఎలా ఉందో అలానే ఉంది. ఈ ఫొటోలను చూసిన అమ్మడు అభిమానులు శ్రియకు ఇంకా పదేళ్లయినా అందం ఏ మాత్రం తగ్గదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ హాట్ బ్యూటీ ఫొటోలను చూసిన ప్రతి ఒక్కరూ లైకులు, షేర్లు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. పెళ్లి తర్వాత ఈ గ్లామర్ గర్ల్ అడపాదడపా సినిమాలు చేస్తూ… తన అభిమానులను అలరిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news