గుర్తుపట్టలేనంతగా మారిపోయిన శృతిహాసన్.. ఫోటోలు వైరల్..!

నెలవంకలా అందమైన మోముకు కేరాఫ్ అడ్రస్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తన అందంతో కుర్రకారును ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడూ కూడా ఎవరికి అర్థం కాదు…ఏదైనా అంటే మై లైఫ్.. మై రూల్స్ అంటూ ఆటిట్యూడ్ మైంటైన్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియా పోస్ట్లు కూడా అలాగే ఉంటాయి. తాజాగా శృతి హాసన్ షేర్ చేసిన కొన్ని సెల్ఫీలు అభిమానులను మరింతగా కంగారు పుట్టిస్తున్నాయి.. సాధారణంగా సినిమాలలో అయినా సరే.. బయట అయినా సరే హీరోయిన్లు మేకప్ లేకుండా రారు.. మరికొంతమంది డి గ్లామరస్ లుక్ షేర్ చేయడానికి అస్సలు ఇష్టపడరు. అది వాళ్ళ కెరియర్ పై ప్రతికూల ప్రభావం పడుతుందని భయపడుతూ ఉంటారు.

అయితే శృతిహాసన్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. తాజాగా కొన్ని వరస్ట్ లుక్స్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలు చూసిన తర్వాత ప్రేక్షకులు ఆమెకు ఏమైంది? అసలు స్టార్ హీరోయిన్ ముఖం అంటే ఇలాగే ఉంటుందా? అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే శృతిహాసన్ ఫీవర్ , సైనస్ తో పాటు రుతుస్రావంతో కూడా బాధపడుతోందట. బ్యాడ్ డే బ్యాట్ హెయిర్ తో నా సెల్ఫీ ఇలా ఉంటుంది.. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారు.. ఇష్టపడతారని భావిస్తున్నాను
.. అంటూ ఆ ఫోటోలకు శృతిహాసన్ ఈ వ్యాఖ్యలను జోడించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరూ ఏంటి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే శృతిహాసన్ కెరియర్ గాడిలో పడగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ముంబైలో విహరిస్తోంది.. దాదాపు రెండేళ్లుగా వీరి రిలేషన్ లో ఎటువంటి అడ్డంకులు కలగలేదు. శృతిహాసన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత మరికొన్ని పాన్ ఇండియా చిత్రాలలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)